సంగారెడ్డి, బుధవారం
సంగారెడ్డి రైతుబజార్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. సర్వీసింగ్ తర్వాత ట్రయల్ రన్ కోసం రోడ్డుపైకి వచ్చిన బైక్ను కారు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
సంగారెడ్డి రైతుబజార్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై బుధవారం స్వల్ప రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సర్వీసింగ్ అనంతరం బైక్ను ట్రయల్ రన్ కోసం రోడ్డుపైకి తీసుకొచ్చిన మెకానిక్ సడన్గా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.



