వార్తచెన్నూర్ ఆధునికీకరణ, 2027 పుష్కరాలకు భారీ ఏర్పాట్లు: మంత్రి వివేకానంద
చెన్నూర్ ను ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2027 గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు రూ.70 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. మంగళవారం చెన్నూర్ లో పుష్కర ఘాట్ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు.













