కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలంలో భూమి ఆక్రమణ, బెదిరింపులకు పాల్పడినట్లు మాజీ VDC అధ్యక్షుడుపై ఆరోపణలు వచ్చాయి. నకిలీ దస్తావేజులతో భూమిని ఆక్రమించే ప్రయత్నం జరిగిందని, విద్యుత్ దొంగతనం కూడా జరిగినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు.
రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన నాగేంద్ర రెడ్డి, సాయిరెడ్డి మధ్య జరిగిన ఆర్థిక వివాదం నేపథ్యంలో ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో సాయిరెడ్డి, కొందరు వ్యక్తులతో కలిసి నాగేంద్ర రెడ్డి ఇంటిపై దాడి చేశారని, దీనిపై నాగేంద్ర రెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు FIR నమోదు చేసి, నిధులను అరెస్ట్ చేశారు.
అయితే, కొద్దిరోజులకే మాజీ VDC అధ్యక్షుడు, గ్రామ పెద్దలు నాగేంద్ర రెడ్డిని రాజీకి రావాలని ఒత్తిడి తెచ్చారని, లేనిపక్షంలో గ్రామంలో ఎటువంటి సహాయం అందదని బెదిరించినట్లు సమాచారం. పోలీసు ఫిర్యాదు చేసినందున, ముందుగా అగ్రిమెంట్ ఇవ్వాలని, ఆ తర్వాతే భూమి రిజిస్ట్రేషన్ జరుగుతుందని, పంచాయితీ తర్వాత నగదు చెల్లింపు ఉంటుందని ఒత్తిడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
తన భార్య ప్రసవ సమయంలో ఉండగా, బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని, ఇప్పుడు కేసు వెనక్కి తీసుకోవాలని లేదా భూమిని వదులుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని బాధితులు వాపోయారు. అంతేకాకుండా, తల్లి భూమిలో విద్యుత్ బాక్స్ ఏర్పాటు చేసి, పంటలకు నీరు అందకుండా చేస్తున్నారని, గ్రామ పెద్దలు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నందున కట్టాలి లేదా భూమి ఇవ్వాలి అని బలవంతం చేస్తున్నారని తెలిపారు.
ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. బాధితులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడి కానున్నాయి.

