సంగారెడ్డి, శుక్రవారం
కొండాపూర్ మండలంలోని మీసేవ కేంద్రాల ఆపరేటర్లతో తహసీల్దార్ అశోక్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. డాక్యుమెంట్లను ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలని, ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించాలని సూచించారు.
కొండాపూర్ మండల కార్యాలయంలో శుక్రవారం తహసీల్దార్ అశోక్ మండలంలోని మీసేవ కేంద్రాల ఆపరేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. లబ్ధిదారుల డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేసిన అనంతరం ఫిజికల్‌గా మండల కార్యాలయానికి తీసుకురాకుండా నేరుగా ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలని ఆపరేటర్లకు సూచించారు.
దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించేలా నిబంధనల మేరకు సేవలు అందించాలని తహసీల్దార్ అశోక్ తెలిపారు.




