సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం మున్సిపాలిటీ కేంద్రంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్ హాజరై సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల సమర్పించి ఘన నివాళులు అర్పించారు.
చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, సుభాష్ చంద్రబోస్ దేశ స్వాతంత్ర్య పోరాటంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మహానాయకుడని కొనియాడారు.
ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు నేటి యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, యువకులు పాల్గొన్నారు.

