సంగారెడ్డి జిల్లా, జనవరి 9: సంగారెడ్డి జిల్లాలోని అన్ని 11 మున్సిపాలిటీలలో ముసాయిదా ఓటరు తుది జాబితాను సోమవారం మున్సిపల్ కమిషనర్లు విడుదల చేశారు. మొత్తం 252 వార్డులకు సంబంధించిన ఫోటో ఓటరు తుది జాబితాను ఆ మున్సిపాలిటీలు మరియు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రదర్శించారు.
ఈ 11 మున్సిపాలిటీలలో సంగారెడ్డి గ్రేడ్ వన్ మున్సిపల్లో 38, అందోలు-జోగిపేట బల్దియాలో 20, నారాయణఖేడ్‌లో 15, సదాశివ పేటలో 26, గుమ్మడిదలలో 22, గడ్డపోతారంలో 18, ఇస్నాపూర్‌లో 22, ఇంద్రదేశంలో 18, కోహీర్‌లో 16, జహీరాబాద్‌లో 27, జిన్నారం మున్సిపల్లో 20 వార్డులు ఉన్నాయి.
గమనించదగ్గ విషయం ఏంటంటే, పటాన్ చెరు నియోజకవర్గంలోని పలు గ్రామాలను కలిపి గుమ్మడిదల, గడ్డపోతారం, ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ వంటి ప్రాంతాలను కొత్తగా మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. అంతేకాక, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసిన విషయం కూడా తెలియజేశారు.

