శాసనసభ ప్రాంగణం, తెలంగాణ (కబుర్లు టుడే) సెప్టెంబర్ 07
శాసనసభ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సెంట్రల్ హాల్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. స్వర్గీయ మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు పేరుతో ఈ హాల్‌ను నామకరణం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
శాసనసభ ప్రాంగణంలో నూతనంగా రూపుదిద్దుకున్న సెంట్రల్ హాల్‌ను సభా నాయకుడు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు గారి పేరుతో సెంట్రల్ హాల్‌గా నామకరణం చేసిన ఈ ప్రాంగణ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖులు స్వర్గీయ శ్రీపాద రావు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి గౌరవ సభ్యులతో కలిసి అల్పాహార కార్యక్రమంలో పాల్గొన్నారు.






