సంగారెడ్డి, 2026-07-30
షఆధెణధఉధ
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో వీరభద్రయ్య సేవా సంస్థ విద్యార్థులకు స్కూల్ డ్రెస్ లను అందజేస్తున్నట్లు సేవా సంస్థ సలహాదారుడు సిహెచ్. దశరథ్ తెలిపారు. ఈ మేరకు గురువారం కొండాపూర్ మండల పరిధిలోని శివన్నగూడెం సర్పంచ్ వినోద్ నాయక్, గంగారం సర్పంచ్ సరిత అశోక్ సమక్షంలో మందాపూర్, గంగారం శివన్న గూడెం, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు,అంగన్వాడీ చిన్నారులకు వీరభద్రయ్య సేవా సంస్థ ఆధ్వర్యంలో స్కూల్ డ్రెస్ లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వెంకటేష్, ఉపాధ్యాయులు సంజీవులు, రామకృష్ణ, అనిల్ కుమార్, ఆనంద్, సి ఆర్ పి వరలక్ష్మి, ఆయలు శాంతమ్మ, బాలమ్మ, పద్మ, లక్ష్మి, గ్రామస్తులు రాం రెడ్డి, అంజయ్య గౌడ్, శేఖర్, శ్రీ రాములు, దుర్గయ్య, బి కే ఎం యు నాయకులు అజిజ్, వినోద్ పాల్గొన్నారు.






