ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో డాగ్స్ తో తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలు ప్రయాణికుల క్షేమం కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేపట్టబడ్డాయి.
పోలీసులు అనుమానాస్పద ప్రాంతాలను, హోటళ్లను, ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్లను తనిఖీ చేశారు.
ప్రయాణికులు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించినప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ కోరారు.
ప్రయాణికులు తమ వ్యక్తిగత వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని, బస్సు వెక్కి క్రమంలో వాటిని పోగొట్టుకోకుండా ఉండాలని సూచించారు.

