సంగారెడ్డి, 2026-07-28
కొండాపూర్ మండలంలోని తెర్పొల్ గ్రామ ప్రభుత్వ పాఠశాలల్లో హానర్ కంపెనీ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా కంపెనీ అధికారులు విద్యార్థులను ఉన్నత లక్ష్యాలతో చదువుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.
కొండాపూర్ మండల పరిధిలోని తెర్పొల్ గ్రామ ప్రభుత్వ బాలికల పాఠశాల, బాలుర పాఠశాల, ఉన్నత పాఠశాలలో హానర్ కంపెనీ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కంపెనీ జీఎం, హెచ్ఆర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, సతీష్, ఉప సర్పంచ్ మల్లేశం, వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






