సంగారెడ్డి, 2026-07-30
ఎణథఆణథథ
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండాపూర్ చెరువు పూర్తిస్థాయిలో నిండి, అలుగు పారుతోంది. చెరువులోకి వరద నీరు భారీగా చేరడంతో చుట్టుపక్కల ప్రాంతాలు ఆహ్లాదకరమైన వాతావరణంతో కళకళలాడుతున్నాయి. చెరువు జలకళను తిలకించేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో, అలుగు ప్రాంతాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు.ఇప్పటికే చెరువు నిండుకుండలా మారడంతో, అదనపు నీరు అలుగు ద్వారా మల్కాపూర్ చెరువులోకి వెళ్తోంది...

