కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను సాధారణ పరిశీలకులు డి. ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.
బుధవారం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను పరిశీలించారు.
నామినేషన్ల స్వీకరణను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
నామినేషన్ కేంద్రాల వివరాలు పరిశీలించారు. మొదటి కేంద్రం రెవెన్యూ సెక్షన్లో, రెండవ కేంద్రం కౌన్సిల్ హాల్లో, మూడవ కేంద్రం అకౌంట్స్ సెక్షన్లో ఏర్పాటు చేశారు.
అన్ని కేంద్రాలలో సీసీ కెమెరాలు, డిజిటల్ గడియారాలు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.1,250, ఇతరులకు రూ.2,500 డిపాజిట్ వివరాలు ప్రకటించారు.


