కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని, పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
కెపిహెచ్బి కాలనీ 5వ ఫేస్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో, ప్రేమ కుమార్ కేక్ కట్ చేసి తన జన్మదినాన్ని జరుపుకున్నారు.
జన సైనికులు, వీర మహిళలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కాలనీవాసులు, వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రేమ కుమార్కు పుష్పగుచ్ఛాలు, శాలువాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ప్రేమ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు ఫోన్ ద్వారా, ప్రత్యక్షంగా, పరోక్షంగా, వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా అభినందనలు తెలిపిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో సందడి నెలకొంది. నాయకులు, కార్యకర్తలు ప్రేమ కుమార్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

