సంగారెడ్డి, 2026-06-05
సంగారెడ్డి జిల్లా జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో 1978-79 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థినులు, తమ గురువులు 47 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఈ సందర్భంగా గురువులను ఘనంగా సన్మానించారు.
సంగారెడ్డి జిల్లా పరిధిలోని జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో 1978-79 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థినులు, తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు 47 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కలుసుకున్నారు. ఈ అపూర్వ కలయిక సందర్భంగా, పూర్వ విద్యార్థినులు తమ గురువులైన ప్రభు, రాధాబాయి, నాగేంద్రమ్మ, పుష్పలత, సంజీదలను ఘనంగా సన్మానించి, వారి పట్ల తమకున్న గురుభక్తిని చాటుకున్నారు.తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించే అవకాశం లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కే పద్మ, సత్యవతి, శాంత, జయలక్ష్మి, సరయు, మంజుల, సిహెచ్ పద్మ, వసంత, రేణుక, సి ఇందిరా, అనురాధ, సుధా, సుజాత, శోభ, ఇందిరా, సంధ్య, వెంకటలక్ష్మి, అంజలి, అనసూయ తదితరులు పాల్గొన్నారు.





