నర్మెట్ట, జూన్ 24
నర్మెట మండల ఉపసర్పంచ్‌ల సమావేశం బుధవారం జిల్లా అధ్యక్షుడు పండుగ హారీష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా మూల కిరణ్ గౌడ్, ఉపాధ్యక్షులుగా బుస్సి లతా కర్ణాకర్ రెడ్డి, ఆంగోత్ శ్రావణ్, ప్రధాన కార్యదర్శిగా సాక్కం అనిల్ కుమార్ ఎన్నికయ్యారు.
నర్మెట మండల ఉపసర్పంచ్‌ల సమావేశం బుధవారం జిల్లా అధ్యక్షుడు పండుగ హారీష్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా హాన్మంతాపూర్ ఉపసర్పంచ్ మూల కిరణ్ గౌడ్, ఉపాధ్యక్షులుగా వెల్దండ ఉపసర్పంచ్ బుస్సి లతా కర్ణాకర్ రెడ్డి, బొమ్మకూర్ ఉపసర్పంచ్ ఆంగోత్ శ్రావణ్, ప్రధాన కార్యదర్శిగా ఆగాపేట ఉపసర్పంచ్ సాక్కం అనిల్ కుమార్, కార్యదర్శులుగా జాటోత్ అనూష, ఆలేటి విజయ్, కోశాధికారిగా జి.నవీన్, బాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పండుగ హారీష్ మాట్లాడుతూ, ఉపసర్పంచ్‌ల హక్కులను కాపాడేందుకు కమిటీ పనిచేస్తుందని అన్నారు. అందరూ కలిసి పార్టీలకతీతంగా తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల ఉపసర్పంచ్లు పాల్గొన్నారు.






