సంగారెడ్డి, 2026-07-25
కొండాపూర్ మండలంలోని మల్లేపల్లి మద్యం పరిశ్రమల్లో 15 రోజులుగా కొనసాగుతున్న ట్రాన్స్పోర్ట్ బంద్‌కు ముగింపు పలికారు. లారీ అద్దె (లోడ్) రేట్లు పెంచాలన్న డిమాండ్‌తో లారీ యాజమాన్యాలు చేపట్టిన బంద్, చర్చల అనంతరం విరమించారు. ప్రస్తుతం ఉన్న లోడ్ రేటుపై 4 శాతం పెంపునకు అంగీకారం కుదిరింది.
కొండాపూర్ మండలంలోని మల్లేపల్లి మద్యం పరిశ్రమల్లో గత 15 రోజులుగా కొనసాగుతున్న ట్రాన్స్పోర్ట్ బంద్‌కు తెరపడింది. లారీ అద్దె (లోడ్) రేట్లు పెంచాలన్న డిమాండ్‌తో లారీ యాజమాన్యాలు బంద్ చేపట్టగా, గతంలో జరిగిన చర్చలు ఫలించలేదు.
శనివారం సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆర్డీవో రాజేందర్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ గణేష్, సీఐ శ్రీనివాస్ రెడ్డి, డీఎస్పీ సత్తయ్య గౌడ్, కొండాపూర్ తహసీల్దార్ అశోక్, పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులు, లారీ అసోసియేషన్, ట్రాన్స్పోర్ట్ యూనియన్ నాయకులతో నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి.
ప్రస్తుతం అమల్లో ఉన్న లోడ్ రేటుపై 4 శాతం పెంపునకు అంగీకారం కుదరడంతో ట్రాన్స్పోర్ట్ బంద్ విరమించి, రవాణా సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి.







