కామారెడ్డి, 21 June
గోదావరిఖని విలేకరులు ఘనంగా సత్కరించారు
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ గారికి, గోదావరిఖని పాత్రికేయులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీలోని బి గెస్ట్ హౌస్లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. రామచందర్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని, రానున్న రోజుల్లో మరింత ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
దేశవ్యాప్తంగా దళిత, బడుగు, బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై కమిషన్ నాయకత్వంలో ఆయన ముందుండి న్యాయం జరిగేలా ప్రత్యేక చొరవ చూపుతున్నారని పాత్రికేయులు కొనియాడారు. జాతీయస్థాయిలో అత్యున్నత పదవిని అలంకరించడం శుభపరిణామమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కనుకుంట్ల రమేష్, మామిడి స్వామి, పురమళ్ళ తిరుపతి, వేల్పుల నగేష్, నాయకులు ఈదునూరి నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.







