ముంబైలోని విలేపార్లే ఇందిరా నగర్ నం-2 లో తెలుగు మహిళలు గత ఐదు సంవత్సరాలుగా పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ వేడుకలు ఆదివారం సెలవు రోజున జరిగాయి, ఇందులో మహిళలు తమ నూతన వస్త్రాలు ధరించి, ఆటలు పాటలతో వేడుకలు జరిపారు. ప్రతి మహిళ మణురాల కోసం ఓ "నీళ్ల ముంతా" భేటీగా ఇచ్చారు.
ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, జగిత్యాల, ధర్మపురి, నల్గొండ, నిజామాబాదు వంటి జిల్లాలకు చెందిన వారు నివసిస్తున్నారు. వీరు గంగపుత్ర బెస్త, చాకలి, మాల, మాదిగ సామాజిక వర్గాలకు చెందినవారు.
ఈ కార్యక్రమంలో స్వరూప ధర్మంజీ, మాట్లాడా ఈశ్వరి, చందనగిరి మల్లేశ్వరి, రాధిక ధర్మంజీ, శోభ కున్బీ, రాధ కున్బి, మేడి లక్ష్మి, నీలా దర్మంజీ, సముద్రాల మానసవిని, దీటి హారిక, దీటి గంగ, బాబాయి మక్రపోలి, గుడికందుల శ్రేషా, బోసరాజల విజయ, భాగ్యలక్ష్మి, పోగుల పూజ తదితరులు పాల్గొన్నారు.
ఈ వేడుకలు తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.


