సంగారెడ్డి, 2026-08-02
ంంగెభచహంంభంగఆంమజఞగచంంగణంఆమంగ.ఒొఆంగంచశమధమృంచ.
1987 - 1989 విద్యాసంవత్సరాల్లో సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్ చదివిన పూర్వ విద్యార్థులు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ అదే ఐటీఐ ప్రాంగణంలో ఆత్మీయంగా కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని విద్యార్థి దశలోని మధుర స్మృతులను పంచుకున్నారు. స్నేహం కాలానికి అతీతమని, ఇలాంటి కలయికలు బంధాలను మరింత బలోపేతం చేస్తాయని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బి. మల్లికార్జున్ గౌడ్, శ్రీశైలం గురుస్వామి, మహేష్ తివారీ, బి. నర్సిములు తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.






