తెలంగాణలో జర్నలిస్టుల సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాలపై బీజేపీ పార్టీ పక్షాన పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు స్పష్టం చేశారు.
తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు నేతృత్వంలో ప్రతినిధి బృందం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావును కలిసింది.
ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇబ్బందులు కలిగిస్తోందని, ముఖ్యమైన అంశాల్లో అన్యాయం జరుగుతోందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ అంశాలపై స్పందించిన ఎన్. రామచంద్రరావు మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యలను బీజేపీ పూర్తిగా అర్థం చేసుకుంటోందని, వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గట్టి పోరాటం ఉంటుందని హామీ ఇచ్చారు.

