నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలువురు బీజేపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రాజీనామాలు జరిగాయి.
నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలువురు బీజేపీ నాయకులు శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. నర్సాపూర్ పట్టణ బీజేపీ ఉపాధ్యక్షుడు డి.మహేందర్ గౌడ్, ట్రెజరర్ బుడ్డ ప్రశాంత్‌తో పాటు పలువురు కార్యకర్తలు బీజేపీకి బైబై చెప్పారు.
మహేందర్ గౌడ్ మాట్లాడుతూ, నర్సాపూర్‌లోని రాజకీయం ప్రస్తుతం పార్టీ నియంత్రణలో లేకుండా కొంత మంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందని తెలిపారు. పార్టీ కోసం నిజాయితీగా, నిబద్ధతతో కష్టపడే కార్యకర్తలకు సరైన గుర్తింపు, అవకాశాలు కల్పించడంలో పార్టీ విఫలమైందని విమర్శించారు.
ఎన్నికలు సమీపించగానే పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పక్కనబెట్టి, ఆర్థిక బలం ఉన్న వారికే టికెట్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసేవ లక్ష్యాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.

