పాల్వంచలో అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా పాల్వంచ పట్టణంలో డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం ఎంపిక చేసిన గదులను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుక్రవారం పరిశీలించారు.
కలెక్టర్ గారు ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా గదుల ఏర్పాటు, స్థల వినియోగం, అంతర్గత ఏర్పాట్లు, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రతి విభాగానికి కేటాయించే గదులను స్పష్టంగా గుర్తించి, నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కౌంటింగ్ నిర్వహణకు సరిపడ స్థలం, వెలుతురు, గాలి ప్రసరణ కల్పించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ సుజాత, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.







